ఎడప్పాడి నుంచి 98 వేల మెజార్టీతో పళనిసామి విజయం.. ఇక్కడ పోటీలో లేని విజయ్ పార్టీ

  • స్వతంత్ర అభ్యర్థిపై 98,110 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • 1,48,933 ఓట్లు సాధించిన పళనిసామి
  • నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీలో లేని టీవీకే అభ్యర్థి
అన్నాడీఎంకే పార్టీ అధినేత పళనిసామి సేలం జిల్లాలోని ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్ కుమార్‌పై 98,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పళనిసామికి 1,48,933 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థికి 50,823 ఓట్లు వచ్చాయి. ఇక్కడ డీఎంకే అభ్యర్థి 44,011 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

అవసరమైనన్ని ప్రతిపాదిత సంతకాలు లేకపోవడంతో ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పార్టీ తరఫున వేసిన డమ్మీ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో తిరస్కరించబడింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పళనిసామి డీఎంకే అభ్యర్థి సంపత్ కుమార్‌‍పై 93,802 ఓట్ల మెజార్టీతో, 2016లో పీఎంకే నాయకుడు అన్నాదురైపై 42,022 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Palaniswami
Edappadi Palaniswami
Edappadi
Tamil Nadu Elections
AIADMK
DMK
Salem
Assembly Elections

More Telugu News